Scholarship 2026: రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయండి

ఇంజినీరింగ్ (Engineering) చదువుతున్న మహిళా విద్యార్థినులకు అదిరిపోయే స్కాలర్‌షిప్ (Scholarship) అవకాశం అందుబాటులోకి వచ్చింది. Schaeffler India Hope Engineering Scholarship 2026 ద్వారా అర్హత ఉన్న విద్యార్థినులకు ఏడాదికి రూ.50,000 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. అంటే మొత్తం రూ.2 లక్షలు వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 15 ఆగస్టు 2026.

Join WhatsApp
Join Now

ఎవరికి అవకాశం?

ఈ స్కాలర్‌షిప్ (Engineering Scholarship)కు భారతదేశంలోని గుర్తింపు పొందిన కళాశాలల్లో 1st Year B.E./B.Tech చదువుతున్న మహిళా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరంలో సైన్స్ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ (12th Standard Science) పూర్తి చేసి ఉండాలి. సాధారణ విద్యార్థినులు ఇంటర్మీడియట్‌లో 60 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి.

దివ్యాంగ మహిళా విద్యార్థినులకు (PwD Students) మాత్రం మార్కుల విషయంలో సడలింపు ఉంది. వారు ఇంటర్మీడియట్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉంటే అర్హులు. అలాగే దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం (Annual Family Income) రూ.5 లక్షలకు మించకూడదు. Schaeffler India లేదా Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.

ఏ కోర్సులకు ప్రాధాన్యత?

ఆటోమొబైల్ (Automobile), మెకానికల్ (Mechanical), మెకాట్రానిక్స్ (Mechatronics), EEE, ECE, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, CSE, IT వంటి ఇంజినీరింగ్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న విద్యార్థినులు ఆన్‌లైన్ అప్లికేషన్ (Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, స్కాలర్‌షిప్‌ను ఎంచుకుని వ్యక్తిగత, విద్యా, బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. అనంతరం 12వ తరగతి మార్కుల మెమో, ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కళాశాల అడ్మిషన్ ఆధారం, ఫొటో వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది: దరఖాస్తుకు చివరి తేదీ 15 ఆగస్టు 2026. గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలి.

APPLY HERE